NRPT: మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కట్ట సురేష్, గణేష్ కుమార్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు


