NZB: ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ గొప్ప మనసు చాటుకున్నారు. నవీపేట(M) బినోలకి చెందిన సత్తవ్వ కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి భైంసా- బాసర జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ అక్కడే నిద్రించింది. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకొని మహిళకు కొత్త బట్టలు అందజేసి భోజనం పెట్టించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
తెలంగాణ
గొప్ప మనసు చాటుకున్న ఎస్సై


