హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాల అనుమతికి 50 దరఖాస్తులు: SI

SRD: వినాయక చవితి సోమవారం ఉండటంతో గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు అనుమతి పొందాలని కంగ్టి SI దుర్గారెడ్డి సూచించారు. మండపం, కమిటీ పేరు, చిరునామా, సభ్యులు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. అనుమతుల కోసం పోలీస్ పోర్టల్ ద్వారా వివరాలు సమర్పించాలని సూచించారు. మండలంలో ఇప్పటివరకు 50 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.