VSP: అల్పపీడన కారణంగా రాబోయే 24 గంటల్లో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు దీనిని గమనించి చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు దాటవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..!


