హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

GDWL: గద్వాల మండలం బీరెల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు కానుకలు అందజేశారు. తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, 2 వేలకుపైగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు విడతలవారీగా రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.