హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ చతుర్థి.. సైబరాబాద్ పోలీసుల స్పెషల్ విషెష్

RR: వినాయక చతుర్థి పండగ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజల ప్రయాణాలన్నీ ఎలాంటి విఘ్నాలు, అంతరాయాలు లేకుండా క్షేమంగా, శుభప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేకమైన వినాయకుడి రూపంలోని ఏరియల్ వ్యూ వీడియోను విడుదల చేసింది. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరింది.