WGL: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ రైల్వే GRP సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. మృతుడి వద్ద ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి


