VKB: తాండూరు సర్దార్ పటేల్ చౌక్, విశాల్ మార్ట్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి 'మట్టి వినాయకుడిని పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం' అని నినాదాలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని కోరారు.
తెలంగాణ
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


