హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

PDPL: సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ బిరుదు కృష్ణతో కలిసి 2వ వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య నేడు విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను వినియోగించడం ఎంతో ప్రయోజనకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్ల శేఖర్, రవీందర్‌ పాల్గొన్నారు.