VKB: కొట్పల్లి మండలంలోని భార్వాది గేటు-మోత్కుపల్లి గ్రామానికి వెళ్లే రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు, గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. బురద కారణంగా వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మట్టి పోసి వత్తులు చేసి రహదారిని చదును చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: భారీ వర్షానికి బురదమయంగా రహదారి


