హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండ ఆస్పత్రిలో మంచినీటి కష్టాలు

NLG: దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని రోగులు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, రాత్రివేళ తాగునీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో పారిశుధ్యం లోపించి దుర్వాసన వస్తోందని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు.