హైదరాబాద్: 28°C
తెలంగాణ

మలక్‌పేట్‌లో ఘనంగా ధర్మ రక్షణ సభ

HYD: మలక్‌పేట్ అసెంబ్లీలో ధర్మ రక్షణ సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధికారులు, సభ్యులు, వివిధ గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జై గణేశ్ మహారాజ్ నినాదాలు చేశారు.