హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెలవు రోజున కిటకిటలాడిన భద్రకాళి ఆలయం

WGL: సెలవు రోజు కావడంతో వరంగల్ భద్రకాళి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.