హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక లడ్డూలకు పెరిగిన గిరాకీ

ATP: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల వేళ లడ్డూలకు డిమాండ్ ఏర్పడింది. మండపాల్లో పూజల కోసం నిర్వాహకులు స్వీట్ షాపుల నుంచి పెద్దఎత్తున లడ్డూలను తరలిస్తున్నారు. కిలో నుంచి 100 కిలోల బరువుండే లడ్డూల కోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు. నిమజ్జనం రోజున జరగబోయే వేలం పాటల కోసం కూడా ప్రత్యేక లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. మరి మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో చెప్పండి.