హైదరాబాద్: 28°C
తెలంగాణ

234 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారు

RR: మల్కాజిగిరి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 234 మంది వాహనదారులను పట్టుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తోటి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్డు భద్రతా సూచనలు పాటించాలని స్పష్టం చేశారు.