హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసులో స్కూల్ టీచర్ అరెస్ట్..!

VZM: ఎస్‌కోట మండలం కొత్తూరుకు చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు అక్కవరపు ప్రవీణ్ కుమార్ (40)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వీఎన్ మూర్తి ఆదివారం తెలిపారు. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికను వేధించడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.