NRPT: గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో రూ.60 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. విక్రమ్ రెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు బీ. కృష్ణయ్య, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు ప్రారంభం


