హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

BHPL: రేగొండ మండలం జూబ్లీనగర్ రాజేశ్వరరావుపల్లి గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకుడు పొలుసాని సునీల్‌రావు అన్నయ్య పొలుసాని సుకుమార్ ఇటీవల మృతి చెందారు. ఆయన దశదినకర్మకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడునూతుల నిషిదర్‌రెడ్డి, హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.