హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

VZM: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచించడంతో కొత్తవలసకి చెందిన ఓ వ్యక్తి మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది సుమారు 1000 ప్రతిమలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నట్లు తెలిపారు.