హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి: ఎస్పీ

సత్యసాయి జిల్లా ప్రజలకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని కోరారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు.