హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం'

KDP: బద్వేలు మండలం వీరపల్లె పంచాయతీ ఆనంద్‌నగర్ ఎస్సీ కాలనీలో పాడైపోయిన తాగునీటి మోటారును సచివాలయ కార్యదర్శి శ్రీనివాసులు తక్షణమే స్పందించి బాగుచేయించారు. వినాయక చవితి పండుగ వేళ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే స్పందిస్తామని ఆయన తెలిపారు.