హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించాలి: CI

KDP: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలన్నారు. విగ్రహాల తరలింపు సమయంలో ట్రాక్టర్‌పై ఐదుగురికి మించి ఉండరాదని, నిమజ్జన సమయంలో పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.