హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: CPI

KRNL: రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పశుగ్రాసం లేక పశువులను రైతులు అమ్ముకుంటున్నారని..అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబును కలుస్తానని.. ప్రభుత్వం స్పందించకుంటే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.