హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరీర దానానికి అంగీకారం

విజయనగరం కంటోన్మెంట్ ఫేజ్-3 ఉడా కాలనీకి చెందిన విశ్రాంత సీనియర్ బ్యాంక్ మేనేజర్ కుప్పిలి వెంకట శ్రీనివాసరావు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనలకు అందించేందుకు కుటుంబ సమక్షంలో దాన పత్రాన్ని అందజేశారు. బ్రెయిన్ డెత్ సంభవిస్తే అవయవాలను దానం చేసేందుకు జీవన్‌దాన్‌లో నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు.