హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి విత్తనాల లారీ బోల్తా

NZB: గుంటూరు నుంచి పత్తి విత్తనాల లోడుతో రాజస్థాన్‌కు వెళ్తున్న లారీ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రేంజ్ ఫారెస్ట్ శివారులో ఆదివారం బోల్తాపడింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో మరో వాహనం అడ్డంగా రావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ మునీష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్ఐ సుమలత తెలిపారు.