హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా!

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పెద్ద ఓమినిపల్లి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.