హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్నేశ్వరుడు ప్రజలందరికి మార్గదర్శకుడు: హరీష్ రావు

SDPT: విగ్నేశ్వరుడు కేవలం దేవుడే కాదని, ప్రజలందరికీ గొప్ప మార్గదర్శకుడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఓ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విఘ్నేశ్వరుడి దయతో ప్రజలందరి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.