WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నూతన పాలకవర్గం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో మైనార్టీ, అణగారిన వర్గాలకు కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
పెబ్బేరులో కో-ఆప్షన్ సభ్యుల నియామకం పెండింగ్


