ELR: వినాయక చవితి వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కుక్కునూరు సీఐ బాల సురేష్ బాబు, ఎస్సై రాజా రెడ్డి సూచించారు. రోడ్లపై వాహనాలను నిలిపి బలవంతంగా చందాలు వసూలు చేయకూడదన్నారు. చిన్న పిల్లలతో చందాలు అడిగించడం, ఇతర మతస్తులతో వాగ్వాదాలకు దిగడం చట్టరీత్యా నేరమన్నారు. పోలీసుల అనుమతి పొందిన రూట్లలోనే నిర్ణీత సమయంలో శోభాయాత్ర జరపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'


