హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవు: SI

NZB: మెండోరలోని పోచంపాడు ఎక్స్‌రోడ్ వద్ద అడ్డగోలు పార్కింగ్‌తో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సై సుహాసినీ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలను నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, రోడ్డు దాటే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వాహనాలను క్రమబద్ధంగా పార్కింగ్ చేయాలన్నారు.