హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దాం: శైలజానాథ్

ATP: నాయకులు, కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలమని, ప్రజలతో మమేకమవ్వడమే విజయానికి మార్గమని శింగనమల నియోజకవర్గ YCP సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. శింగనమలలోని ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.