హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించాలి: సీఐ

కృష్ణా: ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని పామర్రు మండలం పామిడిముక్కల సీఐ చిట్టిబాబు, ఎస్సై శ్రీను సూచించారు. ఊరేగింపులలో మత, రాజకీయ ద్వేషాలు రెచ్చగొట్టే పాటలు, మాటలు ఉండకూడదన్నారు. మండలంలో 70కి పైగా మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.