ASR: జిల్లాలో భారీ వర్షాలతో జలపాతాలు ప్రవహిస్తున్నాయి. పచ్చని అటవీ ప్రాంతాల మధ్య వరదనీరు జాలువారుతూ కనువిందు చేస్తోంది. పొల్లూరు జలపాతం సైతం ప్రమాదకర స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. దీంతో పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు జలపాతాల సందర్శనకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కనువిందు చేస్తున్న జలపాతాలు


