నంద్యాల: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో జలాధివాసంలో ఉన్న సంగమేశ్వర ఆలయ శిఖరం ఐదు వారాల తర్వాత బయటపడింది. ఆలయ శిఖరం కనిపించడంతో పూజారులు అక్కడ జెండా కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 6న ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోగా, నెల రోజుల తర్వాత శిఖరం దర్శనమిచ్చింది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 864 అడుగులకు తగ్గడంతో ఆలయ శిఖరం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
సంగమేశ్వర’ శిఖర దర్శనం.. రానున్న కష్ట కాలానికి ఇది సంకేతమా?


