హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ-జీప్ ఢీ.. డ్రైవర్ మృతి

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి జీప్ ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.