హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రైతన్నలకు శుభవార్త

ATP: జిల్లాలో ఏళ్ల తరబడి 22-ఏ చట్టంలో చిక్కుకున్న బంజరు భూముల సమస్యకు పరిష్కార మార్గం సుగమమైంది. గుంతకల్లు, తాడిపత్రి తదితర మండలాల్లోని 9,917 ఎకరాలకు సంబంధించి 4,532 మంది రైతన్నలకు త్వరలోనే యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.