సత్యసాయి: రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉండాలని YCP నేత, మాజీ MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీని కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పార్టీలోకి వస్తారని, అధికారం కోల్పోయినప్పుడు పార్టీని వీడుతారని అన్నారు. వైసీపీకి నిజాయితీనే బలమని, చెప్పిన మాటను నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీకి నిజాయితీనే బలం: కేతిరెడ్డి


