NLG: గ్రామాభివృద్ధి పనులను ముందుగానే గుర్తించి ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు నార్కట్ పల్లి మండలం గోపాలాయపల్లిని వీజీపీపీ పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 60:40 నిధుల భాగస్వామ్యంతో చేపట్టే పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ ద్వారా రూపొందించనున్నారు. ఈ నెల 15న గ్రామసభ నిర్వహించి పథకంపై అవగాహన కల్పిస్తామని సర్పంచ్ ఇవాళ తెలిపారు.
తెలంగాణ
వీజీపీపీ పైలట్ గ్రామంగా గోపాలాయపల్లి ఎంపిక


