హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన

బాపట్ల: జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలలో మహిళలు, యువతకు శక్తి యాప్ వినియోగం, విశిష్టత, అత్యవసర సమయాల్లో రక్షణ పొందే విధానంపై అవగాహన కల్పించారు. మహిళల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.