BHPL: తెలంగాణలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలాయి. ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం 54,573 మంది వివిధ పింఛన్లు పొందుతున్నారు. పొడిగించిన గడువులో సుమారు 5 వేల కొత్త దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చేయూత పింఛన్లకు దరఖాస్తుల గడువు మరో రెండు రోజులే..!


