కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై కమలాపురం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆటో అదుపుతప్పి మోరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 108 సిబ్బంది క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


