వికారాబాద్ అనంతచతుర్థి సందర్భంగా ఈ నెల 25న పట్టణంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వినాయక ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించాలి'


