AKP: అచ్యుతాపురం మండలం కొండకర్లలో ఇవాళ మట్టి వినాయక విగ్రహాలను ఎస్సై ఎం వెంకట్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తీసుకుని వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ లాలం సింహాచలం నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎస్సై


