MHBD: జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లికుదురు మండలంలోని రావిరాల స్టేజీ వద్ద వాగు రోడ్డుపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో తొర్రూరు- మహబూబాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు ఉదృతంగా ప్రవహిస్తునడంతో వాహనదారులు, ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని నెల్లికుదురు ఎస్సై కరుణాకర్ కోరారు.
తెలంగాణ
VIDEO: రావిరాల వాగు ఉధృతి... రాకపోకలు బంద్


