MHBD: దంతాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని చెట్లు, గోడలపై సేద తీరుతూ గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు వీటిని చూసి భయంతో లోపలికి వెళ్ల కుండా ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగు ముందుకేస్తే దాడి చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
వానరాల దూకుడు.. ఆసుపత్రిలోకి చొరబాటు


