W.G: ఆచంట మండలంలోని నెరుల్లిపాలెంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాండిచ్చేరికి చెందిన సుంకం చెల్లించని 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మద్ది రామశేషయ్య తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న టి.దుర్గారావు, కె. ఆంజనేయులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్


