హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకేరు వాగు చెక్‌డ్యామ్‌కు జలకళ.. చేపల వేటతో సందడి

WGL: పర్వతగిరి మండలం కల్లెడవద్ద ఆకేరు వాగు చెక్‌డ్యామ్‌ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఇవాళ చెక్‌డ్యామ్‌ నిండిపోయి అలుగు పారుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది. చెక్‌డ్యామ్‌ అలుగు పారుతుండటంతో స్థానికులు చేపల వేట కొనసాగిస్తున్నారు. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.