హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజేలకు నో పర్మిషన్: ఎస్సై

W.G: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచంట మండల వ్యాప్తంగా డీజేలకు పూర్తిగా నిషేధం విధించినట్లు SI కె. వెంకటరమణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే పరికరాలను సీజ్ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు.