హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

EXPIRY చిక్కీ.. స్పందించిన DEO

NLR: మనుబోలు జెడ్పి బాలికల పాఠశాలలో విద్యార్థులకు కాల పరిమితి ముగిసిన చిక్కీలు అందించిన ఘటనపై హెచ్ఎం నరేంద్రనాథ్ చౌదరికి డిఇఓ బాలాజీ రావు మెమో జారీ చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ బృందం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన చిక్కీలు విద్యార్థులకు పంపిణీ చేసినట్లు గుర్తించడంతో హెచ్ఎంపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు.