హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ కొండచిలువ పట్టివేత

HNK: కానిపర్తి గ్రామం SC కాలనీ కమ్యూనిటీ హాల్ పక్కన సంచరిస్తున్న 10 అడుగుల కొండచిలువను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ బీట్ అధికారి పొన్నం అశోక్ వివరాల మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి కానిపర్తి గ్రామంలో కొండచిలువ సంచరిస్తోందని అటవీ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో వెళ్లి పట్టుకుని కాకతీయ జూపార్కుకు తరలించినట్లు తెలిపారు.